కుంభమేళా చరిత్ర సుమారు 850 ఏళ్ల నాటిదని చెబుతారు. దీనిని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది. అనగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు.కుంభ మేళా అనేది హిందువులు జరుపుకునే సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేసే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళాను నిర్వహిస్తారు. అయితే ఈ కుంభమేళా చరిత్ర చాలా ఆసక్తికరమైనది. మహా కుంభమేళాను ప్రతి సంవత్సరం కాకుండా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో మహా కుంభమేళాను నిర్వహిస్తారు. చివరిసారిగా 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించగా ఇప్పుడు 2025లో కుంభమేళాను నిర్వహించనున్నారు.ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు?
పన్నెండేళ్ల తర్వాత కుంభమేళా నిర్వహించడానికి ప్రధాన ఆధారం బృహస్పతి కదలికకు సంబంధించినది. ఎందుకంటే బృహస్పతి ఒక రాశిలో సుమారు పన్నెండు నెలల పాటు ఉండి, పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు రాశుల పర్యటనను పూర్తి చేసి తిరిగి అదే రాశిలోకి చేరుకుంటాడు. ఇలా గురువు పన్నెండేళ్ల క్రితం ఎక్కడ ఉన్నాడో పన్నెండేళ్ల తర్వాత అక్కడికే చేరుకుంటాడు. బృహస్పతి పన్నెండు సంవత్సరాల సంచారం.. పునరావృతం కుంభ రాశి ప్రధాన ఆధారం.
సముద్ర మంథనంతో కుంభమేళా ప్రారంభం
కథల ప్రకారం సముద్ర మంథనం ప్రారంభం నుంచి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలు , రాక్షసులు కలిసి అమరత్వం కోసం అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మథనం చేసినప్పుడు. ఆ సమయంలో మొదట హాలాహలం బయటపడింది. దానిని శివయ్య స్వీకరించాడు. ఆ తర్వాత అమృతం రాగానే దేవతలు ఆ అమృతాన్ని స్వీకరించి అమరత్వాన్ని సొంతం చేసుకున్నారు.
కుంభమేళా, 12 సంఖ్య ప్రాముఖ్యత
సమయ వ్యత్యాసం కారణంగా దేవతల పన్నెండు రోజులు మానవుల పన్నెండు సంవత్సరాలతో సమానం. అందుకే ఒక సంవత్సరం తర్వాత ప్రతి ప్రదేశంలో గొప్ప పండుగ కుంభమేళా జరుగుతుంది. సముద్ర మంథనం సమయంలో అమృతం భాండం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం 12 దైవిక రోజులు కొనసాగింది. ఈ సమయం మానవులకు 12 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారు. అందువల్ల ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది యాత్రికులు కుంభమేళాకు స్నానమాచారించడానికి వస్తారు.
కుంభమేళా జరిగే 4 స్థలాలు
పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం 12 సంవత్సరాలు(మానవుల) కొనసాగింది. ఈ యుద్ధ సమయంలో అమృత భాండం నుంచి 2 చోట్ల అమృతం చుక్కలు పడ్డాయి. వాటిలో ఎనిమిది స్వర్గంపై, నాలుగు భూమిపై పడ్డాయి. కుంభమేళా నిర్వహించబడే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని , నాసిక్‌లలో ఈ మకరందం పడినట్లు నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం SRIRAM TV NEWS ఇక్కడ క్లిక్ చేయండి..