SRIRAM TV NEWS : చియాన్ విక్రమ్..గొప్ప మనసు చాటుకున్నాడు.వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం..

దేవతలు నడయాడే భూమిగా పేరున్న కేరళపై ప్రకృతి పగబట్టినట్లుంది. వయనాడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో సుమారు 150 మందికి పైగానే మృతి చెందారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలామంది ఇరుక్కుపోయారని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన పట్ల దేశం యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కేరళ ప్రకృతి విలయతాండవం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలు, బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయన నిధికి విక్రమ్ రూ. 20 లక్షల విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని విక్రమ్ మేనేజర్ యువరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం వల్ల 150 మందికి పైగా చనిపోయారు. అలాగే 197 మంది గాయపడ్డారు. మరెంతో మంది ఆచూకీ లేకుండా తప్పిపోయారు. ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల నటుడు చియాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు’ అని తన పోస్టులో రాసుకొచ్చారు విక్రమ్ మేనేజర్.ప్రస్తుతం ఈ సోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నటుడు విక్రమ్ చాలా మంచి పనిచేశాడని దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విక్రమ్ లాగే నటీనటులందరూ వయనాడ్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు తంగలాన్ మూవీలో నటిస్తున్నారు విక్రమ్. డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో అందాల రాశి మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇందులో పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

  • Related Posts

    SRIRAM TV NEWS : అభిమానులతో కలిసి హల్చల్..నంద్యాల థియేటర్లలో సందడి చేసిన నిహారిక కొణిదెల..!

    రూరల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. మెగా హీరోయిన్ నిహారిక కర్నూలు, నంద్యాల థియేటర్లలో హల్చల్ చేసింది సందడి చేసింది. కమిటీ కుర్రాళ్ళు చిత్రం.. సినిమా థియేటర్లలో చూసి అభిమానులను ఈలలు…

    Continue reading
     SRIRAM TV NEWS : పవన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ బామ్మర్ది మూవీ ఈవెంట్..  పిఠాపురంలో  మొదటి సినిమా ఫంక్షన్.. 

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుణ్యమా అని పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయడం, రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో  పిఠాపురం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    • By admin
    • October 9, 2024
    • 10 views
    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    • By admin
    • October 9, 2024
    • 13 views
    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    • By admin
    • October 6, 2024
    • 17 views
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    • By admin
    • October 6, 2024
    • 16 views
    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    SRIRAM TV NEWS : రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    • By admin
    • October 4, 2024
    • 24 views
    SRIRAM TV NEWS :  రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    • By admin
    • October 4, 2024
    • 22 views
    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!