SRIRAM TV NEWS :Delhi Rain: దేశ రాజధానిలో రెడ్‌అలర్ట్‌ జారీ.. !ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, యూపీలో కుండపోత..

వేడిగాలులతో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉత్తరాదిలో మళ్లీ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవితం అస్తవ్యస్థంగా మారింది. కొద్దిరోజుల క్రితం ముగ్గురు సివిల్స్‌ అభ్యర్ధులు ప్రాణాలు కోల్పోయిన రాజేంద్రనగర్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. పోలీసుల బారికేడ్లు నీట మునిగాయి. రాజేంద్రనగర్‌లోని సెల్లార్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. హస్తినలోని పలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి.భారీవర్షాలతో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది . ప్రతికూల వాతావరణం కారణంగా 10 విమానాలను దారిమళ్లించారు. భారీవర్షం లోనే విద్యార్ధులు తమ ఆందోళనలను కొనసాగించే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ఢిల్లీతోపాటు NCR పరిధిలో భారీవర్షాలు కురుస్తున్నాయి. నోయిడా, ఘజియాబాద్‌ , గుర్‌గావ్‌ , ఫరీదాబాద్‌లో కుండపోత కురిసింది. సాయంత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు వర్షం కారణంగా రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం రెండు గంటలపాటు కురిసిన వర్షానికి ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అయింది.ఉత్తరాఖండ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్‌లో భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గంగానది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూపీ రాజధాని లక్నోలో కుంభవృష్టి కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు యూపీ అసెంబ్లీ లోకి వరదనీరు ప్రవేశించింది. సభ జరుగుతున్న సమయంలోనే వరదనీరు అసెంబ్లీలోకి ప్రవేశించింది. =అసెంబ్లీ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బకెట్లతో నీటిని తోడిపోశారు. వాహనాలన్నీ నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా వరదనీరు చేరింది. సబ్‌వేల్లోకి కూడా వరదనీరు ప్రవేశించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మిక వరదల్లో పలు వాహనాలు చిక్కుకుపోయాయి.

  • Related Posts

     SRIRAM TRV NEWS : రూ.2,000 కోట్లు ఖర్చు..భారతదేశంలో మొదటి ఎయిర్ రైలు..!

    దేశంలో బలమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది. ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. లక్షల ట్రాక్‌లపై దేశవ్యాప్తంగా రైళ్లు నడుస్తున్నాయి. సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్‌, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు…

    Continue reading
    SRIRAM TV NEWS : కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం ఏకంగా 992 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు…జనవరిలో అతిపెద్ద మహా కుంభమేళా -2025…!
    • adminadmin
    • September 29, 2024

    కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    • By admin
    • October 9, 2024
    • 10 views
    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    • By admin
    • October 9, 2024
    • 13 views
    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    • By admin
    • October 6, 2024
    • 17 views
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    • By admin
    • October 6, 2024
    • 16 views
    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    SRIRAM TV NEWS : రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    • By admin
    • October 4, 2024
    • 24 views
    SRIRAM TV NEWS :  రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    • By admin
    • October 4, 2024
    • 22 views
    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!