పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుణ్యమా అని పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయడం, రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో పిఠాపురం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఇక సినిమా వాళ్లు కూడా పిఠాపురం వైపే చూస్తున్నారు. ఆ మధ్యన శర్వానంద్ మనమే సినిమా ఈవెంట్ ను ఇక్కడే నిర్వహించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో అనుమతులు రాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అయితే ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ జరగకపోయినా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పిఠాపురంలో వెళ్లి సందడి చేస్తున్నారు. శనివారం (ఆగస్టు 03) మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఇక్కడకు వచ్చింది. తన కమిటీ కుర్రాళ్లు సినిమా నటులతో ఇక్కడి కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఇప్పుడు ఎట్టకేలకు పిఠాపురంలో మొదటి సినిమా ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎన్టీఆర్ బామ్మర్ది, మ్యాడ్ సినిమా హీరో నార్నె నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ఆయ్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది.ఇక ఆయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పిఠాపురంలో నిర్వహించనున్నారు. సోమవారం (ఆగస్టు 05) పిఠాపురంలోని సత్యకృష్ణ కన్వెన్షన్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి నార్నె నితిన్ తో పాటు హీరోయిన్, మూవీ టీమ్ అంతా హాజరవుతున్నారు. అలాగే నిర్మాత అల్లు అరవింద్ కూడా రావొచ్చని సమాచారం. అలాగే పిఠాపురంలో మొదటిసారి అధికారికంగా సినిమా ఈవెంట్ నిర్వహించనుండడంతో ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు స్థానికులు భారీగా హాజరుకావచ్చునని సమాచారం.
SRIRAM TV NEWS : అభిమానులతో కలిసి హల్చల్..నంద్యాల థియేటర్లలో సందడి చేసిన నిహారిక కొణిదెల..!
రూరల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. మెగా హీరోయిన్ నిహారిక కర్నూలు, నంద్యాల థియేటర్లలో హల్చల్ చేసింది సందడి చేసింది. కమిటీ కుర్రాళ్ళు చిత్రం.. సినిమా థియేటర్లలో చూసి అభిమానులను ఈలలు…