ఎంజాయ్ చేస్తున్న జనం…దట్టమైన అడవుల్లో పాల ధారలా దూకుతున్న జలపాతాలు..

తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం బయట పడింది. కొండలపై నుండి పాల ధారలు జాలువారుతున్న ఆ జలపాతాల సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది. మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో జలపాతాలు మరింత సందడిగా మారాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ఆ జలపాతాలలో సందర్శకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.తెలంగాణ నయాగరా బొగత జలపాతాలకు సమీపంలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దట్టమైన అడవుల్లో కనువిందు చేస్తున్న ఈ జలపాతాల సందర్శనకు జనం పోటెత్తుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహితాపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. మహితాపురం జలపాతం వద్ద పర్యాటకులతో తెగ సందడిగా మారింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో జలపాతానికి జలకళను సంతరించుకుంది.

జలపాతం సుమారు 120 అడుగుల ఎత్తైన కొండలపై నుండి పాల ధారలా కిందకు దూకుతుంది. మైమరపిస్తున్న ఈ జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఎటు చూసినా కొండలు, గుట్టలు.. దట్టమైన అడవి, పచ్చని చెట్ల నడుమ, ఎత్తైన కొండలపై నుండి జాలువారుతున్న ఈ జలపాతాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

ఈ జలపాతానికి చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల మేర అటవీ మార్గాన నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ జలపాతం వద్ద ఈత కొడుతూ కేరింతలతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సెలవు దినం వచ్చిందంటే చాలు ఈ జలపాతాల మరింత సందడిగా మారుతోంది.

  • Related Posts

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    దసరా పండుగ సెలవులతో హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లన్ని కూడా ఫుల్ రష్ గా ఉన్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో కనీసం కాలుపెట్టే చోటు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.…

    Continue reading
    SRIRAM TV NEWS : సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రయోగం..త్వరలో ట్రాన్స్‌జెండర్లకు కొత్త బాధ్యతలు..!
    • adminadmin
    • September 13, 2024

    హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి ముందుకొచ్చిన వినూత్న ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని వాలంటీర్లుగా వినియోగించేందుకు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈ ఆలోచన ద్వారా…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    • By admin
    • October 9, 2024
    • 10 views
    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    • By admin
    • October 9, 2024
    • 13 views
    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    • By admin
    • October 6, 2024
    • 17 views
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    • By admin
    • October 6, 2024
    • 16 views
    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    SRIRAM TV NEWS : రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    • By admin
    • October 4, 2024
    • 24 views

    • 22 views
    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!