మొదట్లో ఆధార్ పాన్ లింక్ సదుపాయాన్ని ఉచితంగానే అందించినా ప్రస్తుతం ఐటీ శాఖ ఆధార్-పాన్ లింక్ చేయడానికి రుసుము వసూలు చేస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆధార్-పాన్ లింక్ లేకపోయినా అధిక పన్నుల నుంచి ఇటీవల పలు మినహాయింపులను ఇస్తున్నారు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) పాన్, ఆధార్‌ను లింక్ చేయడానికి ముందు మినహాయించిన వ్యక్తి లేదా కలెక్టీ మరణిస్తే టీడీఎస్/టీసీఎస్ అధిక రేటు వర్తించదని సూచిస్తూ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు.భారతదేశంలో ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పాన్ కార్డు చాలా అవసరం. ముఖ్యంగా ఆధార్ అందుబాటులోకి వచ్చాక పాన్-ఆధార్ లింక్ చేయకపోతే వివిధ పన్నులను ఆదాయపు పన్ను శాఖ విధిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆధార్-పాన్ లింక్ లేకపోయినా అధిక పన్నుల నుంచి ఇటీవల పలు మినహాయింపులను ఇస్తున్నారు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) పాన్, ఆధార్‌ను లింక్ చేయడానికి ముందు మినహాయించిన వ్యక్తి లేదా కలెక్టీ మరణిస్తే టీడీఎస్/టీసీఎస్ అధిక రేటు వర్తించదని సూచిస్తూ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. పన్ను చెల్లింపుదారుల నుంచి డిపార్ట్‌మెంట్‌కు అనేక ఫిర్యాదులు అందిన తర్వాత నిర్ణీత గడువులోపు అంటే మే 31, 2024న లేదా అంతకు ముందు మరణించిన సందర్భాల్లో మాత్రమే పాన్, ఆధార్‌లను అనుసంధానించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీడీటీ తాజాగా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా పాన్‌ను ఆధార్‌కి లింక్ చేయడంలో విఫలమైతే టీడీఎస్ 20 శాతం చొప్పున తీసేస్తారు. అదేవిధంగా టీసీఎస్ సెక్షన్ 206 సీసీకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా అధిక రేటు ఐదు శాతం వరకు సేకరిస్తారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా మరణించిన వ్యక్తికు సంబంధించిన పాన్, ఆధార్‌ను లింక్ చేయడం గురించి సరైన నిబంధనలు లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ తరహా అప్లికేషన్స్ అన్ని ఐటీ శాఖ వద్ద వేల కొద్దీ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పన్ను చెల్లింపుదారులు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి మార్చి 31, 2024 వరకు పూర్తి చేసిన లావాదేవీలకు డిడక్టర్ లేదా కలెక్టర్ మరణించిన సందర్భాల్లో అధిక టీడీఎస్/టీసీఎస్ రేటు వర్తించదని సీబీడీటీ స్పష్టం చేసింది. దీని బట్టి ఆధార్-పాన్ లింక్ గడువుకు ఐటీ శాఖ విధించిన ఆఖరి తేదీ వరకు ఎలాంటి పన్నులు వర్తించవని సీబీడీటీ స్పష్టం చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సర్క్యులర్ ప్రకారం పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను పరిష్కరించడానికి సెక్షన్ 206 ఏఏ, 1206 సీసీ కింద టీడీఎస్/టీసీఎస్‌కు సంబంధించిన అధిక రేటు వర్తించిన కేసులకు సంబంధించి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ముఖ్యంగా 31.03.2024 నుంచి 31.05.204 వరకు నమోదు చేసిన లావాదేవీలకు అంటే పాన్, ఆధార్‌ను అనుసంధానం చేసే ముందు తీసివేత/కలెక్టీ మరణించిన సందర్భంలో డిడక్టర్/కలెక్టర్‌పై ఎలాంటి బాధ్యత ఉండదని సీబీడీటీ పేర్కొంది. మూలం వద్ద మినహాయించిన అధిక పన్ను లేదా మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్)ని నివారించడానికి, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ మే 31, 2024గా ఉంది. మినహాయించిన వ్యక్తి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయనప్పుడు టీడీఎస్ అధిక రేటుతో తీసేస్తారు.