రాఖీ పండగ రోజున చాలా మంది సోదరులు చాలా ఉత్సాహంతో రాఖీని కట్టుకుంటారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడైనా విసిరివేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీని ఒకటి లేదా రెండు రోజుల తర్వాత విసిరేయడం తప్పు. కనుక ఈ తప్పు చేయకూడదు. ఇలా చేయడం అశుభం. రక్షాబంధన్ తర్వాత ఎన్ని రోజుల వరకూ రాఖీని ఉంచుకోవాలి.. తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం శ్రవణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండగ ను పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముల్ల మధ్య ప్రేమకు ప్రతీక. ఈ రోజున తమ సోదరీమణుల దీర్ఘాయువుని కోరుతూ సంతోషకరమైన జీవితం కోసం సోదరుల మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. మంచి, చెడు సమయాల్లో తమ సోదరీమణులను ఎల్లప్పుడూ ఆదుకుంటామని వాగ్దానం చేస్తారు. రాఖీ పండగ రోజున చాలా మంది సోదరులు చాలా ఉత్సాహంతో రాఖీని కట్టుకుంటారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడైనా విసిరివేస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీని ఒకటి లేదా రెండు రోజుల తర్వాత విసిరేయడం తప్పు. కనుక ఈ తప్పు చేయకూడదు. ఇలా చేయడం అశుభం. రక్షాబంధన్ తర్వాత ఎన్ని రోజుల వరకూ రాఖీని ఉంచుకోవాలి.. తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం.రాఖీ పండగ రోజున రాఖీ కట్టడానికి శుభ సమయం (రక్షా బంధన్ 2024 రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం)హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు 19 సోమవారం జరుపుకుంటారు. ఈసారి కూడా రాఖీ పండగ రోజున భద్ర నీడ ఉంది. కనుక ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను మధ్యాహ్నం 1:30 తర్వాత జరుపుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
మధ్యాహ్నం 1:46 నుండి 4:19 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం.
సాయంత్రం శుభ సమయం: సాయంత్రం 6.56 నుండి రాత్రి 9.07 వరకు.
రాఖీ కట్టేటప్పుడు ఈ దిశలో ముఖం పెట్టండి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టించుకోవడానికి సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో సోదరి పడమర ముఖంగా ఉండటం శుభప్రదం. రాఖీ కట్టే ముందు సోదరుడికి కుంకుమ, చందనంతో తిలకం దిద్ది.. ఆ తర్వాత అక్షతలను తలపై వేయాలి. దీని తర్వాతే రాఖీ కట్టాలి.
రక్షాబంధన్ తర్వాత రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే
రక్షాబంధన్ తర్వాత రాఖీని ఒకటి లేదా రెండు రోజుల్లో తీసి విసిరేయకూడదు. రాఖీని కనీసం 21 రోజులు ఉంచుకోవాలి. ఇన్ని రోజులు రాఖీ చేతికి ఉంచుకోలేకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా సోదరి కట్టిన రాఖీని ఉంచుకోవాలి.రాఖీ తీసిన తర్వాత దాన్ని ఏం చేయాలి?జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీని తీసివేసిన తర్వాత దానిని ఎక్కడ బడితే అక్కడ విసిరేయకుండా ఆ రాఖీని ఎర్రటి గుడ్డలో చుట్టి పవిత్ర స్థలంలో లేదా మీ సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచండి. మళ్ళీ వచ్చే రాఖీ పండగ వరకు ఉంచండి. తరువాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలివేయండి. రాఖీ విరిగిపోయినా లేదా చినిగిపోయినా దానిని ఒక రూపాయి నాణెంతో పాటు చెట్టు మూలాల దగ్గర పాతిపెట్టండి లేదా నీటిలో వదలండి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని SRIRAM TV NEWS తెలుగు ధృవీకరించడం లేదు.