ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది ఎన్నో ఏళ్ల విశాఖ వాసులు కల కంటున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ప్రకటన జారీ చేశారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర రైల్వే శాఖ ముందుకు వచ్చింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అన్ని రకాల చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వం సరి చేసిందని, ఇక రైల్వే జోన్ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని మంత్రి తెలిపారు. అతిత్వరలోనే విశాఖ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలక సిద్ధమవుతామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.మరోవైపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.అయితే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యమైంది. దీంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా రైల్వేశాఖ మంత్రి ప్రకటనతో విశాఖ రైల్వే జోన్‌పై కీలక ప్రకటన వెలువడింది. దశాబ్దాల కాలం నుండి రైల్వే జోన్ ఏర్పాటుకు ఎన్నో వినతులు చేసినప్పటికీ.. అది ఇప్పటికీ నెరవేరబోతోందని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!
మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది.దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు…