భారత్‌లోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ దాదాపు రెండున్నర కోట్ల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణ ఛార్జీలు విమాన ప్రయాణం కంటే చాలా చౌకగా ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. రైల్వే ప్రయాణికులకు కొన్ని నిబంధనలున్నాయి. రైల్వేలో సీట్ల విషయంలో కూడా నిబంధనలు ఉన్నాయి. మీరు రిజర్వేషన్ చేసుకుని ఎక్కాలనుకున్న రైలు మిస్సయితే మీ సీటును సీటును కోల్పోవచ్చు. అయితే రైలు బయల్దేరిన తర్వాత మీ సీటు ఎంతసేపు ఉంటుందో తెలుసా?భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు మీ రైలును మిస్ అయితే, TTE మీ సీటును మరొకరికి ఇవ్వవచ్చు. అయితే ఎంత సేపటి తర్వాత ఇవ్వవచ్చన్న నిబంధన ఉంది. నిబంధనల ప్రకారం రైలు బయలుదేరిన తర్వాత టీటీఈ రెండు స్టేషన్ల వరకు ఎవ్వరికి కూడా మీ సీటును కేటాయించరు. అంతేకాకుండా, టీటీఈ కనీసం 1 గంట వేచి ఉండాలి. అయితే అప్పుడు కూడా మీ సీటు ఖాళీగా ఉంటే టీటీఈ ఈ సీటును మరో ప్రయాణికుడికి ఇస్తారు.రైల్వే నిబంధనల ప్రకారం, మీరు మీ రైలును మిస్ అయితే తర్వాత మరో వాహనం ద్వారా తదుపరి స్టేషన్‌కు చేరుకుని ఆ రైలు ఎక్కవచ్చు. టీటీ మీ సీటును వారిలో ఎవరికైనా ఇచ్చినట్లయితే, మీరు మీ సీటును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిబంధనల ప్రకారం.. మీరు తదుపరి స్టేషన్‌కు చేరుకుని రైలు ప్రయాణం చేయవచ్చు.
రిజర్వేషన్ చేసుకున్న తర్వాత కూడా మీరు రైలు పట్టుకోలేకపోతే.. ఆ సందర్భంలో మీరు మీ టికెట్ ధరలో సగం తిరిగి పొందవచ్చు. దీని కోసం, మీరు రైలు బయలుదేరిన 3 గంటలలోపు టిక్కెట్‌ను రద్దు చేసి, టీడీఆర్ ఫైల్ చేయాలి. మీరు దీన్ని చేయకపోతే మీకు తిరిగి రీఫండ్ రాదు.