తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత కలకలం సృష్టించింది. నగర శివారులో చిరుత పులి సంచారంతో జనం హడలిపోయారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఒక కార్యాలయం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. చిరుత పులి అడుగుజాడలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.పులి సంచరించినట్టు సీసీ కెమెరా దృశ్యాలతో నిర్ధారణకు రావడంతో స్థానిక ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అధికారులు. చిరుత తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక పంచాయతీ అధికారులు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చిరుత సంచారంపై రాజానగరం ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ. దివాన్ చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరామ్‌పురం అటవీప్రాంతం వైపు చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు ఎమ్మెల్యే బత్తుల.
SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!
మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది.దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు…