SRIRAM TV NEWS : సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రయోగం..త్వరలో ట్రాన్స్‌జెండర్లకు కొత్త బాధ్యతలు..!

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి ముందుకొచ్చిన వినూత్న ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని వాలంటీర్లుగా వినియోగించేందుకు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈ ఆలోచన ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారికి సమాజంలో గౌరవం తీసుకురావడమే కాకుండా, నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ఒక కొత్త మార్గం చూపించినట్లు అవుతుందని భావిస్తున్నారు సీఎం రేవంత్. హోమ్ గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను సీఎం సూచించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, శుభ్రత, ఇతర కీలక పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా, టెండర్ల ద్వారా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల పనితీరుపై ఆయన నిశితంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను ఏమాత్రం ఉపేక్షించరాదని సీఎం ఆదేశించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్ల అభివృద్ధి, ఫుట్ పాత్ నిర్మాణాలు, ఇతర పనులను గడువులోపు పూర్తిచేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై పూర్తి స్థాయి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు.తప్పుడు నివేదికలు సమర్పించిన అధికారులపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చర్యలు జరుగుతుండగా, అవి సమయానికి పూర్తవ్వడం కోసం తగిన క్రమశిక్షణతో పని చేయాలని సీఎం ప్రత్యేకంగా ఆదేశించారు. ఇక ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి ట్రాఫిక్ స్ట్రీమ్‌లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని వాలంటీర్లుగా వినియోగించేందుకు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వాలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హోమ్ గార్డ్స్ తరహా ఉద్యోగాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఆసక్తి ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించి, తగిన విధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి సూచించిన ఈ కొత్త ఆలోచన ఒకవైపు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సమాన అవకాశాలు కల్పిస్తుండగా, మరోవైపు నగర ట్రాఫిక్ సమస్యలపై ఒక పరిష్కార మార్గాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

  • Related Posts

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    దసరా పండుగ సెలవులతో హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లన్ని కూడా ఫుల్ రష్ గా ఉన్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో కనీసం కాలుపెట్టే చోటు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.…

    Continue reading
    SRIRAM TV NEWS : అందుబాటులోకి 400 ఎంబీబీఎస్ సీట్లు…తెలంగాణ మెడికల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్..!
    • adminadmin
    • September 10, 2024

    యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    • By admin
    • October 9, 2024
    • 10 views
    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    • By admin
    • October 9, 2024
    • 13 views
    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    • By admin
    • October 6, 2024
    • 17 views
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    • By admin
    • October 6, 2024
    • 16 views
    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    SRIRAM TV NEWS : రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    • By admin
    • October 4, 2024
    • 24 views
    SRIRAM TV NEWS :  రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    • By admin
    • October 4, 2024
    • 22 views
    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!