SRIRAM TV NEWS: మాలధారణే మంచి మెడిసిన్ ఈ ఆలయం ఎక్కడంటే…? మద్యం అలవాటుని మానిపించే పాండు రంగడు..!

మద్యం అలవాటు ఆ వ్యక్తి.. ఆరోగ్యాన్ని , ఆర్ధిక పరిస్తిని తలకిందులు చేస్తుంది. అతని ఫ్యామిలీని తీవ్ర కష్టాలు పాలు చేస్తుంది. మందు తాగడం తప్పు అని తెలిసినా ఆ అలవాటుని విడిచి పెట్టలేని వారు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి మందుబాబులకు మంచి మెడిసిన్ ఒక ఆలయం. ఒక్కసారి ఆ గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇక మందు వైపే చూడరట. ఇలాంటి మహామహి మానిత్వ ఆలయం పాండురంగ స్వామి ఆలయం..భారత దేశంలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కొండ కోనల్లో అనేక ఆలయాలు, పవిత్ర క్షేత్రాలున్నాయి. నేటికీ సైన్స్ చెందించలేని అనేక మిస్టరీ ఆలయాలున్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాలకు వెళ్ళడం అక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన మనిషిలోని చెడు గుణాలకి స్వస్తి చెప్పి మంచి నడవడికతో జీవిస్తాడని నమ్మకం. కాణిపాక వరసిద్ది వినాయకుడిని దర్శనం చేసుకోవడం .. స్వామివారి ముందు చేసే ప్రమాణానికి సంబంధించిన నమ్మకం ఉంది. వినాయకుడి ముందు ఎవరైనా ప్రమాణం చేసి అబద్ధం చెబితే 3 నెలల్లో స్వామి శిక్షిస్తారని భక్తుల నమ్మకం. అదే విధంగా మద్యానికి బానిసైన మందుబాబులు అనంతపురం జిల్లాలోని ఒక ఆలయంలోని స్వామిని దర్శించుకుంటే ఆ అలవాటు నుంచి బయట పడతారని విశ్వాసం. ఈ రోజు ఆ ఆలయ మహత్యం ఏమిటో తెలుసుకుందాం..మందుబాబులకు మంచి మెడిసిన్ ఈ ఆలయం

మద్యం అలవాటు ఆ వ్యక్తి.. ఆరోగ్యాన్ని , ఆర్ధిక పరిస్తిని తలకిందులు చేస్తుంది. అతని ఫ్యామిలీని తీవ్ర కష్టాలు పాలు చేస్తుంది. మందు తాగడం తప్పు అని తెలిసినా ఆ అలవాటుని విడిచి పెట్టలేని వారు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి మందుబాబులకు మంచి మెడిసిన్ ఒక ఆలయం. ఒక్కసారి ఆ గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇక మందు వైపే చూడరట. ఇలాంటి మహామహి మానిత్వ ఆలయం పాండురంగ స్వామి ఆలయం.. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలోని ఉంతకల్లు గ్రామంలో ఉంది. స్వామివారి మాలధారణ చేసిన మందుబాబులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తమ మద్యం అలవాటు నుంచి బయటపడతారని.మహిమ గల దేవుడు పాండురంగడు

కర్ణాటకలోని ఉడిపి దేవాలయంలో కొలువైన పాండు రంగడు మాదిరిగా ఉంతకల్లు లో పాండురంగ దేవాలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఎంతో మహిమ కలవారని గ్రామస్తుల నమ్మకం. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మద్యానికి బానిసైన వారు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుని పాండురంగ మాల ధరిస్తే మళ్ళీ జన్మలో మద్యం తాగారని నమ్మకం. అంతేకాదు ఇందుకు ఉదాహరణగా మాల వేసుకుని మద్యం తాగడం మానేసిన అనేక మంది వ్యక్తులను చూపిస్తూ ఉంటారు గ్రామస్తులు.

ఎప్పుడు పాండురంగడు మాల ధరించాలంటే

అయితే ఈ మాలను ఎప్పుడు బడితే అప్పుడు, ఏరోజు బడితే అప్పుడు ధరించాకూడదు. మాల ధరించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ మాలధారణను నెలలో కేవలం రెండు రోజుల మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏకాదశి తిధి రోజునే.. అంటే నెలకు ఏకాదశి తిధులు.. శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి.. కనుక ఈ నెలలో ఈ రెండు రోజుల్లోనే మాల ధరించాలి. దీంతో మద్యంఅలవాటుకి గుడ్ బై చెప్పాలి అనుకునే మందు బాబులు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రెండు రోజులు భారీ సంఖ్యలో స్వామివారి గుడికి చేరుకుంటారు.

పాండురంగ మాల ధరించడానికి ఏమి చేయాలంటే

పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందుగా అంటే ఏకాదశి తిది కంటే కొన్ని రోజులు ముందుగా ఆలయం వద్ద రూ.100 చెల్లించి ఒక టోకెన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆ మాలను పాండు రంగ స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. తర్వాత ఏకాదశి సూర్యోదయ సమయంలో నిద్ర లేచి స్నానమాచరించి స్వామీ వారి ఆలయానికి చేరుకోవాలి. ఆలయ ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్ లో నిలబడాలి. తర్వాత ఆలయ ప్రధాన పూజారి టోకెన్ నెంబర్ ఆధరంగా మెడ లో మాలను ధరిమ్పజేస్తాడు.

ఉచిత భోజన వసతి

ఏకాదశి తిది రోజున వచ్చే భక్తులందరికీ గ్రామస్తులే ఉచిత భోజనాన్ని అందిస్తారు. మాల నిమిత్తం ఇచ్చిన రూ. 100తప్ప ఇక దేనికీ డబ్బులు తీరుకోరు. పాండు రంగ మాలధారణ చేసిన భక్తులు వరుసగా మూడు ఏకాదశ తిధుల్లో పాండు రంగడి దర్శనం చేసుకోవాలి. మాల ధారణ చేసిన వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయాలి. ఇలా మూడు ఏకాదశి తిధులు నిద్ర చేసిన తర్వాత కావాలంటే మాలను తీయవచ్చు.

ఆలయానికి ఎలా చేరుకోవాలంటే

ముందుగా అనంతపురానికి చేరుకోవాలి. అనంతరపురానికి ప్రభుత్వ బస్సులు, రైళ్లు రవాణా సదుపాయం ఉంది. అక్కడ నుంచి రాయదుర్గం వరకు బస్సు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి అక్కడి బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చేరుకోవాలి. లేదా రాయ దుర్గం వరకూ ట్రైన్ లో చేరుకుని ఆటో తీసుకుని ఉంతకల్లు పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.

స్వామివారి దర్శన సమయాలు : ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పాండురంగ స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు.

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

  • Related Posts

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    పంచభూతాత్మాక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది.గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన లేక…

    Continue reading
     SRIRAM TV NEWS : 14వ శతాబ్దం నాటి శాసనం… బయటపడిన త్రిపురాంతకేశ్వర ఆలయ రహస్యాలు.. !

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ స్తంభంపై ఈ శాసనం చెక్కి ఉన్నట్టు గుర్తించారు. 14వ శతాబ్దంలో వీరశైవులుగా…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    • By admin
    • October 9, 2024
    • 10 views
    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    • By admin
    • October 9, 2024
    • 13 views
    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    • By admin
    • October 6, 2024
    • 17 views
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    • By admin
    • October 6, 2024
    • 16 views
    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    SRIRAM TV NEWS : రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    • By admin
    • October 4, 2024
    • 24 views
    SRIRAM TV NEWS :  రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    • By admin
    • October 4, 2024
    • 22 views
    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!