హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు విమానయాన శాఖ తీపికబురునందించింది. ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటల్లోనే అయోధ్య రాములోని సన్నిధికి చేరుసుకునే అవకాశాన్ని విమానయాన శాఖ కల్పిస్తోంది. హైదరాబాద్ టూ అయోధ్య విమాన సర్వీసులతో పాటు మరో రెండు సర్వీసులను సెప్టెంబర్ 27న నుంచి విమానయాన శాఖ ప్రారంభించింది.హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు సెప్టెంబర్ 27శుక్రవారం నుంచి వరుసగా విమాన సర్వీసులు ప్రారంభించారు. దీంతో.. ఇక భక్తులు అయోధ్యకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకునే అవకాశం లభించింది. సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్ టూ అయోధ్యతో పాటు హైదరాబాద్ టూ కాన్పూర్‌కు.. వారానికి 4 రోజుల పాటు సేవలందించే విమాన సర్వీసులను విమానయాన శాఖ ప్రారంభించింది.
వీటితో పాటు.. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటే విమాన సర్వీసులు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, అయోధ్యకు వెళ్లే భక్తులు ఈ విమాన సర్వీసులు వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ సూచిస్తోంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ నుంచి అగర్తాల, హైదరాబాద్ నుంచి జమ్మూకు విమాన సర్వీసులు కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్త సర్వీసులు కూడా ప్రారంభించింది.