SRIRAM TV NEWS : ఆ అంశాలపై ప్రత్యేక ఫోకస్  తిరుమల కల్తీ నెయ్యి కేసును స్పీడప్ చేసిన సిట్..!

తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు స్పీడు అందుకుంది. ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ తిరుపతిలో కొనసాగుతోంది. నిన్న తిరుమల వెంకన్నను దర్శించుకుని దర్యాప్తు చేపట్టిన సిట్ ఈ రోజు ఈఓ తో భేటీ అయ్యింది. ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్న టిటిడి వర్క్ డివైడ్ చేసుకుని పక్కా యాక్షన్ ప్లాన్ లోకి దిగింది. అదనపు సిబ్బందితో పలు ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారిన తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై విచారణ ఏం తేల్చబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. తిరుపతిలో మకాం వేసిన సిట్ దర్యాప్తు ఎలా జరగనుందన్న అంశం ఆసక్తిగా మారింది. సిట్ చీఫ్ సర్వ శ్రేష్ట త్రిపాఠి బృందం ఇన్వెస్టిగేషన్ ఫోకస్ తప్పు చేసిన వారి భరతం పట్టేలా ఉంది. తిరుమల నుంచే ప్రక్షాళన షురూ అయ్యిందన్న సీఎం చంద్రబాబు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించడంతో సిట్ ఎంక్వయిరీ కూడా అదే రీతిలో జరుగుతుంది.టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించిన ప్రభుత్వం అందులో భాగంగానే ఆయనకు రెండు టాస్క్ లు ఇచ్చింది. లడ్డూలో నాణ్యత లేమికి కల్తీ నెయ్యి కారణమన్న అనేక ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని లడ్డూపై ఫోకస్‌ పెట్టాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే లడ్డు ఆపరేషన్ ప్రారంభం కాగా నెయ్యిలో నాణ్యత లేదన్న విషయం తేలింది. ముందుగా వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని గుర్తించిన టిటిడి NDDB ల్యాబ్ రిపోర్ట్ లతో యానిమల్ ఫ్యాట్ తేల్చింది. ఈ అంశమే దేశవ్యాప్తంగా రచ్చరాజేసింది. ఏపీ సర్కార్ నిజాలు డిక్కు తేల్చేందుకు సిద్ధం చేసింది. సిట్ ఏర్పాటుకు కారణం అయింది. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు డైరీ ని టేకప్ చేసిన సిట్ లోతైన దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది.

సిట్ హెడ్ గా సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వం వహించగా 9 మంది టీం తిరుపతిలో మకాం పెట్టి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రెండ్రోజులుగా సాగుతున్న దర్యాప్తు ఇప్పటి వరకు గుర్తించిన అంశాలు, వివాదాలపై ఫోకస్ పెట్టింది. సిట్ మూడు బృందాలు విడిపోయి విచారణ చేపట్టబోతోంది. తిరుమలలో సిబ్బంది, అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు నెయ్యి కొనుగోలు, వినియోగంపై ఆరాతీస్తోంది. మరో వైపు తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న AR డెయిరీ సెంట్రిక్ గా ఎంక్వైరీ చేస్తోంది. టీటీడీ నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న AR డెయిరీ వివరాలు, సప్లై అంశాలను రాబట్టబోతుంది. ఏఆర్ డయిరీ సప్లై చేసిన నెయ్యి లో కల్తీని, ఏస్ వాల్యూస్ తేడాను బయటపెట్టిన గుజరాత్‌ NDDBకి ల్యాబ్ రిపోర్టులను పరిశీలిస్తున్న సిట్ అవసరమైతే అక్కడికే వెళ్లి ఆరా తీయబోతుంది.ఇక సిట్ లో కొందరు అధికారులు శ్రీవారి లడ్డూ తయారుచేసే పోటు సిబ్బందిని, నెయ్యి కొనుగోలు చేసిన మార్కెటింగ్ విభాగం అధికారులను ప్రశ్నిస్తున్న సిట్ బృందం స్వయంగా కూడా సందర్శించి సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తోంది. నెయ్యిలో నాణ్యతా లోపించిందని గుర్తించింది ఎలా, రెగ్యులర్‌గా నాణ్యతా ప్రమాణాలు పరీక్షిస్తున్న విధానం, ఏటా నెయ్యి కొనుగోళ్లకు టిటిడి ఖర్చు చేస్తున్న సొమ్ము, ప్రతీ రోజు వినియోగిస్తున్న నెయ్యి వివరాలను కూడా సేకరించిన సిట్ బృందం AR డయిరీ టార్గెట్ గా దర్యాప్తు నిర్వహిస్తోంది. అసలు టిటిడి రెగ్యూలర్‌గా నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వస్తోందా… టెండర్ కండిషన్ ప్రకారం నిబంధనలు పాటిస్తున్నారా… ల్యాబ్‌లో పరీక్షించడం జరుగుతోందా లేదా అన్న ప్రశ్నలతో సిట్ టీం విచారణ చేస్తుంది. తమిళనాడులోని AR డెయిరీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా పరిశీలిస్తుంది. టీటీడీకి నీ సరఫరా చేస్తామంటూ కాంట్రాక్టు దక్కించుకున్న AR డయిరీ ఉత్పత్తి చేసే నెయ్యి, అందులో నాణ్యతా ప్రమాణాలేంటి… పరీక్షల్లో ఫ్యాట్ వాల్యూస్ ఎంత మేర ఉన్నాయి… ఇందుకు సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయా… అందులో ఉన్న నిజాలు ఏంటి అన్నదానిపై సిట్ విచారించింది.

టెండర్ విధానమే లోపం భూయిష్టంగా ఉంటే ఇందుకు కారణం ఎవరు అన్నదానిపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఇక సిట్ లోని మరికొందరు అధికారులు నెయ్యిలో అనిమల్ ఫ్యాక్టర్ ను గుర్తించిన గుజరాత్ NDDB రిపోర్ట్స్ ని కూడా పరిశీలిస్తుంది. అవసరమైతే అక్కడికి వెళ్లే చాన్స్ ఉందన్న సంకేతాన్ని ఇస్తున్న సిట్ టీం నెయ్యి పరీక్షల్లో వచ్చిన ఫలితాలు దేనికి సంకేతమన్న దానిపై దృష్టి పెట్టబోతోంది. నిజంగానే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందా… పరీక్షా విధానంతోపాటు ఫలితాల గురించి వివరాలు సేకరించనున్న సిట్ విచారణ బృందం కాలపరిమితి నిర్దేశించకపోవడం తో క్షేత్రస్థాయిలో డీటెయిల్ ఎంక్వయిరీ చేస్తుంది. విచక్షణా అధికారాలు కల్పించిన ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక తయారు చేసేలా సిట్ పనిచేస్తుంది. ఇందులో భాగంగానే తిరుమల లడ్డులోని నెయ్యి కల్తీని తేల్చే పనిలో ఉంది.

  • Related Posts

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది.దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు…

    Continue reading
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    పంచభూతాత్మాక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది.గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన లేక…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    • By admin
    • October 9, 2024
    • 10 views
    SRIRAM TV NEW: రైలులో బైక్ పార్శిల్: రైలులో ద్విచక్ర వాహనాన్ని పార్శిల్ చేయడం ఎలా? రైలు సామాను మరియు పార్శిల్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి…!

    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    • By admin
    • October 9, 2024
    • 13 views
    SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!

    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    • By admin
    • October 6, 2024
    • 17 views
    SRIRAM TV NEWS : రైలులోనూ వెళదాం…అరుణాచలం..!

    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    • By admin
    • October 6, 2024
    • 16 views
    SRIRAM TV NEWS : పగలు, రాత్రి పుష్కలంగా కరెంటు ఉంటుంది.సోలార్ కంటే బెటర్. ఇప్పుడు మీరు పైకప్పుపై ఒక చిన్న గాలి టర్బైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

    SRIRAM TV NEWS : రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    • By admin
    • October 4, 2024
    • 24 views
    SRIRAM TV NEWS :  రూ.99కే మద్యం అందుబాటులోకి…అక్టోబరు 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమలు…!

    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!

    • By admin
    • October 4, 2024
    • 22 views
    SRIRAM TV NEWS : Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌…!