కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళా అతి పెద్ద మత సమ్మేళనం. ప్రత్యేక రైళ్లను నడపడంతో..ప్రయాగ్‌రాజ్, సెప్టెంబర్ 29: కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళా అతి పెద్ద మత సమ్మేళనం. ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు వివిధ మౌలిక సదుపాయాలు, ప్రయాణికులకు సౌకర్యాల కల్పన కోసం రైల్వే మంత్రిత్వశాఖ రూ.933 కోట్లను సైతం కేటాయించింది. అలాగే రైళ్ల రాకపోకలకు ప్రయాగ్‌రాజ్ డివిజన్, దాని పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.3,700 కోట్లతో రైల్వే ట్రాక్‌ల డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.జనవరి 12 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళా సందర్భంగా భారీ సంఖ్యలో భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లను సమీక్షించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు రవ్‌నీత్ సింగ్ బిట్టు, వీ సోమన్న సమావేశాలు నిర్వహించారు. సన్నాహాలను పరిశీలించేందుకు ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే జోన్లకు చెందిన జనరల్ మేనేజర్లు సహా సీనియర్ అధికారులతో సహా సీనియర్ రైల్వే అధికారులతో క్రమం తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రయాగ్‌రాజ్, వారణాసి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, లక్నో వంటి రైల్వే డివిజన్‌ల డివిజనల్ మేనేజర్‌లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. వీరంతా ప్రస్తుతం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేస్తున్నారు.
కుంభమేళాకు 30 నుంచి 50కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. వివిధ నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 6,580 సాధారణ రైళ్లతో పాటు 992 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. 2019లో జరిగిన కుంభమేళాకు 24 కోట్ల మందికిపైగా ప్రజలు హాజరైనట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆ సమయంలో 5వేల సాధారణ, అదనంగా 694 ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు తెలిపారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల సంఖ్యను 42శాతం పెంచి 992 నడిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇంకా రైళ్లను పెంచాల్సిన అవసరం ఉంటే.. బ్యాకప్ ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నామన్నారు.వివిధ ఓవర్ బ్రిడ్జి పనులకు సుమారు రూ.440 కోట్లు ఖర్చ చేయనున్నట్లు మరో అధికారి తెలిపారు. మిగతా రూ.495కోట్లతో స్టేషన్‌లకు వెళ్లే రోడ్ల మరమ్మతులు, ప్లాట్‌ఫారమ్‌లు, చుట్టుపక్కల సీసీ కెమెరాల ఏర్పాటు, స్టేషన్లలో వెయిటింగ్ హాల్స్‌తో పాటు ప్రయాణికుల కోసం అదనపు వసతి యూనిట్లు, వైద్య సదుపాయాలు తదితర కార్యకలాపాల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. వారణాసి – ఝూసీల మధ్య రైలు మార్గాల డబ్లింగ్ పూర్తయిందని, ప్రయాగ్‌రాజ్-రాంబాగ్-ఝూసీ- జంఘై-ఫాఫామౌ లైన్‌లు కుంభమేళా ప్రారంభానికి ముందే సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రత్యేకమైన ఫ్రైట్ కారిడార్ కూడా సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు. కాగా మహా కుంభమేళా మన దేశంలో ప్రతి ఐదేళ్ల కొకసారి నిర్వహిస్తారు. ఈ కుంభమేళాకు దేశ నలువైపుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. దీనిలో భాగంగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో మునిగిపోయారు.