కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, రంగారావు సత్తెనపల్లిలో ‘సాయిచరణ్ జ్యువెలర్స్’ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ఆభరణాలను తయారుచేసి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విక్రయిస్తుంటారు. అందులోభాగంగా రంగారావు, ఆయన సోదరుడు సతీశ్‌బాబుతో కలిసి బంగారు ఆభరణాలను తీసుకొని మంగళవారం రాత్రి సత్తెనపల్లి నుంచి బళ్లారి వెళ్లారు. మూడు రోజులపాటు బళ్లారిలో ఉండి పలు దుకాణాల వ్యాపారులను సంప్రదించినా.. వారు ఆభరణాల కొనుగోలుకు ముందుకు రాలేదు. దీంతో శుక్రవారం రాత్రి హుబ్బళ్లి-విజయవాడ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు.నంద్యాల వరకు మెలకువగా ఉన్నా, తర్వాత ఆభరణాలున్న బ్యాగును రంగారావు తన తల కింద పెట్టుకొని నిద్రపోయారు. రైలు దొనకొండ సమీపానికి వచ్చేముందు మెలకువ వచ్చి చూసుకోగా బ్యాగు కనిపించలేదు. దీంతో వెంటనే రైలుదిగి దొనకొండ రైల్వే స్టేషన్‌కు శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో వెళ్లారు. అక్కడ రైల్వే పోలీసుస్టేషన్ లేకపోవడంతో.. కొందరు మార్కాపురం వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లారు. అక్కడివారు నరసరావుపేట వెళ్లాలని చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్లారు. అక్కడి రైల్వే పోలీసులు సాయంత్రం వరకు రకరకాల ప్రశ్నలు అడిగి, చివరికి దొంగతనం జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని, అక్కడికి వెళ్లాలని సూచించారు. దీంతో వారు రాత్రి నరసరావుపేట నుంచి బయలుదేరి నంద్యాల రైల్వే పోలీసుల వద్దకు వెళ్లారు. చోరీ జరిగిందని తెలిసినా.. దొంగలను పట్టుకునేందుకు వెంటనే స్పందించకపోగా.. కనీసం కేసు నమోదుచేయకుండా రైల్వే పోలీసులు పరిధి పేరుతో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
SRIRAM TV NEWS : మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…!
మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది.దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు…