ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ మిత్రులందరికి నమస్కారం
గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారికి APCOJAC అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ గారు పెరుమాళ్ మధుగారు మనం పడుతున్న బాధలు విన్నవించుకున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే
తర్వాత రోజు టిడిపి పార్టీ ఆఫీసు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి క్రమంలో పల్ల శ్రీనివాసరావు గారిని APCOJAC రాష్ట్ర కమిటీ మెంబర్స్ కొంతమంది కలవడం సమస్యలను వివరించగా. మీ కేబుల్ ఆపరేటర్ మిత్రులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దానికి సీఎం గారిని పిలుస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే
ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు పల్ల శ్రీనివాసరావు గారిని గౌరవ ప్రదంగా వారి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను వివరిస్తూ విన్నవించుకోవడం జరిగింది. సమస్యలపై వారు సానుకూలంగా స్పందిస్తూ మీరు పెట్టుకునే మీటింగ్ కి కేబుల్ ఆపరేటర్స్ అందరి తరపున ఒక లెటర్ ఇవ్వాలని ఆ లెటర్ ని ముఖ్యమంత్రివర్యులుకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి చిన్న చిన్న కేబుల్ ఆపరేటర్లు మరియు మధ్య తరగతి దిగువ తరగతి ఆపరేటర్లు అందరూ కూడా బాగుపడాలని ఉద్దేశంతో వారి కేబుల్ జీవనవృత్తి బాగుండాలని ఉద్దేశంతో కేబుల్ ఆపరేటర్ సమస్యలను విన్నవించుకొనుటకు వెళ్ళినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు
APCOJAC కేబుల్ ఆపరేటర్ల రాష్ట్ర చైర్మన్ మిరియాల శ్రీరామ్ గారికి
విజయనగరం జిల్లా ఇంచార్జ్ నారాయణరావు గారికి
శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ నామా గిరి గారికి
ఇంకా కొంతమంది తోటి ఆపరేటర్ మిత్రులు విశాఖ జిల్లా ప్రతినిధులు అప్పలనాయుడు గారు రమణ గారు ప్రకాష్ గారు మరి కొంతమంది jac అసోసియేషన్ మెంబర్స్ వెళ్లి ఉన్నారు
వారందరికీ APCOJAC రాష్ట్ర కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.