ఇందుగలడందు లేడని సందేహము వలదు అనే పద్య తాత్పర్యం ప్రపంచ సాంకేతిక యవనికపై సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. అన్ని రంగాల్లోకి క్రమంగా ఏఐ టెక్నాలజీ పాకిపోతుంది. ఆఖరికి వ్యవసాయ రంగంలోకి కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ప్రవేశించింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏఐ టెక్నాలజీతో పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సరికొత్త వ్యవసాయ ప్రాజెక్టుకు అమెరికాలోని రిచ్‌మాండ్ వేదికగా మారింది.ప్రపంచంలో జనాభా పెరుగుతున్నా కొద్దీ ఆ మేరకు ఆహార అవసరాలు కూడా పెరుగుతూ వచ్చాయి. జనాభా ఆకలి తీర్చేందుకు సరిపడా పంటల ఉత్పత్తి కోసం శాస్త్రవేత్తలు కొత్త కొత్త వంగడాలు సృష్టించారు.. సృష్టిస్తూనే ఉన్నారు. పంటల ఉత్పత్తికి సృజనాత్మకత జోడించడం ద్వారా పుట్ల కొద్దీ పంటలు తీస్తున్నారు. తద్వారా ఆకలితో అలమటించని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం చేసే రోజులు మరెంతో కాలం లేదని చాటుతున్నారు.
SRIRAM TV NEWS : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మీ లగేజీ పోయిందా..? అయితే, ఇలా పరిహారం పొందండి..!
భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తున్నారు. వీరి కోసం భారతీయ రైల్వే వేలాది రైళ్లను నడుపుతోంది.రైలులో ప్రయాణించడానికి భారతీయ రైల్వే అనేక నియమాలను రూపొందించింది. రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడు…