కేరళలోని వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికిపైగా ప్రజలు మృతిచెందగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ శనివారం వయనాడ్‌లో పర్యటించనున్నారు. సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు మోడీ పర్యటించనున్నారు శనివారం ఉదయం 11 గంటలకు మోడీ కన్నూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు.మధ్యాహ్నం 12:15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ ప్రధానికి రెస్క్యూ ఫోర్స్ సహాయక చర్యలు గురించి వివరిస్తారు. అక్కడ జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని పర్యవేక్షిస్తారు. అలాగే బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయ శిబిరాలు, ఆసుపత్రిని కూడా సందర్శిస్తారు. అక్కడ కొండచరియలు విరిగిపడిన బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని పరామర్శిస్తారు.ఆ తర్వాత అధికారులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు ప్రధాని.
SRIRAM TV NEWS : ఇలా చేస్తే మీరు టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టకుండా ఎన్నిసార్లయినా ఫ్రీగా తిరగొచ్చు…!
మీరు లాంగ్ టూర్ వెళ్లినప్పుడు ఎన్నో టోల్ ప్లాజాలు క్రాస్ చేస్తుంటారు కదా. ప్రతి టోల్ ప్లాజా దగ్గర వందల రూపాయలు కట్టి వెళుతుంటారు. అయితే మీరు కనుక ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులైతే మీరు టోల్ ప్లాజాను ఎన్నిసార్లయినా క్రాస్…