SRIRAM TV NEWS : హ్యాట్సాఫ్ అంటోన్న క్రీడాభిమానులు…దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత.. !

పారిస్ ఒలింపిక్స్‌లో-2024లో భారత్ తన ప్రయాణాన్ని ముగించింది. టోక్యో ఒలింపిక్స్ కంటే ఒకటి తక్కువగా అంటే మొత్తం ఆరు పతకాలు సాధించింది. షూటింగ్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో భారత్ పతకాలు సాధించింది. భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, స్థలాలు కూడా ఆఫర్ చేస్తున్నాయి.అయితే ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఒక క్రీడాకారుడు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన రెండు ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆ అథ్లెట్ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్‌తో కలిసి భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు సరబ్ జోత్ సింగ్. హర్యానాలోని అంబాలాలోని దీన్ గ్రామానికి చెందిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అంతే కాదు ప్రభుత్వ ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ సరబ్‌జోత్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకునేందుకు తిరస్కరించాడు.సరబ్జోత్ సింగ్ రైతులు జతీందర్ సింగ్, హర్దీప్ కౌర్ కుమారుడు. చండీగఢ్‌లో చదువు పూర్తి చేశాడు. అంతకుముందు సరబ్‌జోత్ సింగ్ 2019 జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. అదే సమయంలో, 2022 ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ జట్టులో భాగంగా సరబ్జోత్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది కాకుండా, సరబ్జోత్ సింగ్ ఆసియా క్రీడలలో భారతదేశానికి రజత పతకాన్ని అందించాడు. వీటన్నింటికి తోడు పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన సరబ్‌జోత్ సింగ్‌కు హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్ పదవిని కట్టబెట్టాయి. దీంతో పాటు రూ.2.50 కోట్ల నగదు బహుమతిని కూడా హర్యానా ప్రభుత్వం అందజేసింది. హర్యానా క్రీడా మంత్రి సంజయ్ సింగ్ ఈ అవార్డును ప్రకటించారు.

కానీ 22 ఏళ్ల సరబ్జోత్ సింగ్ హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు ఆఫర్ చేసిన ఉ ద్యోగాలను తిరస్కరించాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని సరబ్‌జోత్ సింగ్ వివరిస్తూ, ‘ఉద్యోగం బాగానే ఉంది. కానీ నేను ఇప్పుడు అలా చేయడం కుదరదు. ముందుగా నా షూటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను. మా కుటుంబం కూడా నన్ను ప్రభుత్వ ఉద్యోగం చేయమని అడుగుతోంది. కానీ నాకు షూటింగ్‌పై ఆసక్తి ఎక్కువ. కాబట్టి నా నిర్ణయాలలో కొన్నింటికి వ్యతిరేకంగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయలేను’ అని సరబ్ జోత్ చెప్పాడు.

  • Related Posts

    SRIRAM TV NEWS : IPL 2025 మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ఎంఎస్ ధోనికి లైన్ క్లియర్.. అదేంటంటే?

    IPL 2025: ఐపీఎల్‌కి ముందు మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే బీసీసీఐ, ఐపీఎల్ తదుపరి సీజన్ జట్ల మధ్య సమావేశం జరిగింది. అప్పటి నుంచి IPL 2025 మెగా…

    Continue reading
     ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఇదే

    Paris Olympics 2024: నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. గురువారం జరిగే ఆర్చరీ పోటీల్లో భారత అథ్లెట్లు దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్, బి ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ పోటీపడనున్నారు. ఈ పోటీతో…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!

    • By admin
    • November 23, 2024
    • 43 views
    SRIRAM TV NEWS : APSFL  చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని  ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన  APSFL చైర్మన్ గారు…!

    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    • By admin
    • November 19, 2024
    • 34 views
    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    • By admin
    • November 18, 2024
    • 31 views
    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    • By admin
    • November 18, 2024
    • 38 views
    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    SRIRAM TV NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    • By admin
    • November 2, 2024
    • 52 views
    SRIRAM TV  NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!

    • By admin
    • October 26, 2024
    • 62 views
    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!