SRIRAM TV NEWS : 90 అడుగుల అభయ హనుమాన్‌ విగ్రహం ఆవిష్కృతం…అమెరికాలో అరుదైన ఘట్టం..!

అమెరికాలోని హ్యూస్టన్ నగరం..దివ్య సాకేతంగా మారింది. ఆంజనేయ నామ స్మరణతో మారుమోగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో..హ్యూస్టన్‌ నగరంలోని దివ్య అష్టలక్ష్మీ ఆలయంలో ఆలయంలో.. భవ్యమైన అభయ హనుమాన్‌ విగ్రహం ఆవిష్కృతమైంది. స్టాట్యూ ఆఫ్ యూనియన్‌గా వ్యవహరిస్తున్న 90 అడుగుల అభయ హనుమాన్‌ విగ్రహం.. అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే.. ఆ దైవీగుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి హనుమంతుడు అవతరించాడు. వేద హృదయమై రామాయణం భాసిల్లితే.. ఆ వేద ధర్మాన్ని ప్రతిఫలింపజేయడానికి వేదమూర్తిగా వాయుపుత్రుడు వ్యక్తమయ్యాడు. ఇప్పుడు పవనసుతుడు హ్యూస్టన్ నగరంలో 90 అడుగుల మహా విగ్రహమై భాసిల్లుతున్నాడు. అగ్రరాజ్యం నుంచి సనాతన భారత ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటుతున్నాడు.

సీతారాముల కథను సుందరమయం చేసినవాడు హనుమంతుడు. సీతారాములను కలిపిన సేతువు ఆంజనేయుడు! హ్యూస్టన్ వేదికగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా ఆవిష్కృతమైన అభయ హనుమాన్‌ విగ్రహం కూడా.. చైతన్య రూపమై..వేద హృదయమై..వేద ధర్మన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.భక్తి భావన, కార్యసాధన, ఆత్మశోధన, నిరుపమాన స్వామి ఆరాధనలకు సాకార రూపం.. ఆంజనేయుడు! రామ కార్య నిర్వహణలో నిబద్ధతను చాటినవాడు హనుమంతుడు. సీతా శోకాన్ని నివారించి, ఆమెకు ఆనందాన్ని అందించిన ప్రసన్న మూర్తిగా ఆంజనేయుడు వర్ధిల్లాడు. ఇలా ఎందరో జీవితాలకు సుందరత్వాన్ని ఆపాదించిన దివ్య సుందరుడు- హనుమంతుడు. ఇప్పుడా సుందర చైతన్యతత్వం..అభయ హనుమాన్‌ రూపంలో హ్యూస్టన్ నగరంలో ఆవిష్కృతమైంది. భక్తి తత్పరతకు ప్రతిరూపంగా మారుతి కొలువుదీరాడు.

ఆ విగ్రహ సౌందర్యం చూశారా! హ్యూస్టన్ అష్టలక్ష్మీ ఆలయ వేదికగా..90 అడుగుల ఎత్తులో.. యావత్‌ లోకానికి హనుమంతుడు అభయహస్తం ఇస్తున్నట్టుగా ఉంది ఆ దివ్య తేజస్సు! సకల గుణ సమన్వయ రూపధారిగా, అఖిల దేవతా శక్తుల ఏకీకృత వజ్రాంగ దేహుడిగా రామాయణంలో హనుమను వాల్మీకి మహర్షి దర్శించాడు. శ్రీశ్రీశ్రీ చినజీయర్‌ స్వామి అమృత హస్తాలతో లోకార్పణ కాబోతున్న 90 అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్‌ కూడా.. యావత్‌ ప్రపంచాన్ని ఏకం చేసే సనాతన చైతన్యంతో.. పంచభూతాల తేజస్సుతో..భారతీయ వసుధైక కుటుంబ భావనకు ప్రతీకగా భాసిల్లుతోంది.

పంచ మహా శక్తుల సమన్వయంతో ఆంజనేయుడు పరిఢవిల్లుతున్నాడు. ప్రతికూల సంహార శక్తికి నృసింహతత్త్వాన్ని.. జ్ఞాన గరిమకు హయగ్రీవ అంశను.. అనంత వేగశక్తికి గరుత్మంతుడిని.. ఆపదుద్ధారక తత్త్వానికి వరాహమూర్తిని.. శ్రేయో సంధాయకతకు వానర రూపాన్ని.. విరాట్‌ రూప హనుమ తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. లంక అనే శ్రీనగరిలో శ్రీచక్ర రాజ నిలయగా భాసిల్లే సీతామహాలక్ష్మిని.. తన సాధనా పటిమతో, అనిర్వచనీయ తపోదీక్షతో దర్శించి, తరించాడు. అందుకే హనుమను.. మహాదేవీ అనుగ్రహ భవ్య రూపుడిగా.. కపిల తంత్రం అభివర్ణించింది.

సత్య చైతన్య రూపమై..వేద హృదయమై..వేద ధర్మన్ని అర్థం చేసుకోవడానికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ దోహదం చేస్తుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. సర్వోత్కృష్టమైన ఉపాసనా సంవిధానంతో..హ్యూస్టన్‌ నగరంలోని అష్టలక్ష్మీ ఆలయంలో.. అభయ హనుమాన్‌ విగ్రహాన్ని లోకార్పణం గావించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి! హ్యూస్టన్‌ నగరంలో వెలిసింది కేవలం 90 అడుగుల విగ్రహం మాత్రమేకాదు. ఆగ్రరాజ్యంలో భారతీయ సనాతన వైభవం! శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి అఖండ తపోనిష్ఠకు, సత్య సంకల్పాన్నికి సాక్షాత్కార రూపం!

  • Related Posts

    SRIRAM TV NEWS : ఆ భయానక దృశ్యాలు భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..!
    • adminadmin
    • September 30, 2024

    భారీ వరదలతో కొండచరియలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ…

    Continue reading
    SRIRAM TV NEWS : దక్షిణ కొరియా ఆఫర్‌..! కానీ,..వరద కష్టాల్లో కిమ్‌ రాజ్యం..

    ఉత్తరకొరియాలో భారీ వరదలకు 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రాణ నష్టంపై కిమ్‌ సర్కారు ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!

    • By admin
    • November 23, 2024
    • 42 views
    SRIRAM TV NEWS : APSFL  చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని  ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన  APSFL చైర్మన్ గారు…!

    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    • By admin
    • November 19, 2024
    • 33 views
    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    • By admin
    • November 18, 2024
    • 30 views
    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    • By admin
    • November 18, 2024
    • 37 views
    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    SRIRAM TV NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    • By admin
    • November 2, 2024
    • 51 views
    SRIRAM TV  NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!

    • By admin
    • October 26, 2024
    • 61 views
    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!