సూర్యుడు, చంద్రుడు.. ఈ రెండు గ్రహాలు భూమిపై ఎంతో ప్రభావం చూపిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ రెండు గ్రహాలు భూమికి నిర్ధిష్ట దూరంలో ఉన్నాయి కాబట్టే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఒకవేళ ఈ రెండు గ్రహాలు భూమికి ఏమాత్రం దగ్గరగా వచ్చినా మనుషులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూర్యుడు ఒక్క అంగుళం ముందుకు జరిగినా భూమిపై వినాశనం జరుగుతుంది. కక్ష్య నుంచి ఒక అంగుళం వెనక్కి జరిగినా భూమిపై మంచు పేరుకుపోతుంది. ఇది మనకు తెలిసిందే. మరి చంద్రుడు భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతాడో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చంద్రుడు భూమికి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అయితే ఒకవేళ చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు భూమిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసిందే. ముఖ్యంగా భూమిపై ఉన్న నీటిపై చంద్రుడి ప్రభావం పడుతుంది. పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోట్లు రావడానికి కారణం ఇదే. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి మహాసముద్రాలతో పాటు నీటి వనరులపై ప్రభావం పడుతుంది.
చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే , అలల బలాలు బాగా పెరుగుతాయి . దీని కారణంగా, సముద్రాల నీటి మట్టం అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది తీర ప్రాంతాలలో తీవ్రమైన వరదలకు దారి తీస్తుంది. దీంతో తీరా ప్రాంతాల్లో ఉన్న వారు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల భూమికి సంబంధించిన టెక్టోనిక్ ప్లేట్లపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇది భూకంపాలకు దారి తీస్తుంది.చంద్రుడు భూమికి దగ్గరగా రావడం మానవ జీవితంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనిషి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్ల సూర్యుడు, చంద్రుని మధ్య దూరం పెరిగే అవకావం ఉంటుంది. ఇది కూడా భూమిపై ప్రభావం పడుతుందని అంటున్నారు.