SRIRAM TV NEWS : 10 రోజులుగా కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు… కోలుకుంటున్న విజయవాడ..!

వరద తగ్గుముఖం పట్టడంతో బురద బాగా పేరుకుపోయింది. దీంతో అనేక రకాల వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్న నేపధ్యంలో పారిశుధ్యం పనులు వేగంగా సాగుతున్నాయి. అంతేకాదు బాధితులకు సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇంటింటికీ నష్ట గణన సర్వే తో పాటు హెల్త్ సర్వే కూడా కొనసాగుతోంది. అనేక వాహనాలు, ఫ్రిజ్, గ్యాస్ స్టవ్ సహా ఇతర నిత్యావసర వస్తువుల వంటి వరద నీటిలో మునిగిపోయాయి. వీటి మరమ్మత్తులకు మెకానిక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.భారీ వర్షాలు కారణంగా బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరం వరదల్లో చిక్కుతుంది. గత కొన్ని రోజులుగా వరద ప్రభావంతో జలదిగ్భందంలో చిక్కుకున్న కాలనీల్లో నీరు తగ్గుముఖం పడుతూ వస్తోంది. అవును వరద ప్రభావం నుంచి విజయవాడ క్రమేపీ కోలుకుంటోంది. బుడమేరు వాగుకి ఏర్పడిన గండ్లు పూడ్చడంతో పాటు మరోవైపు వరుణుడు శాంతిచడంతో వరద ప్రభావిత ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. మరీ లోతట్టు ప్రాంతాలు తప్ప దాదాపు అనేక కాలనీలు సాధారణ స్థితి కి చేరుకుంటున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు, సిని, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు పలు స్వచ్చంద సంస్థలు కూడా ముందుకొచ్చాయి. ఆహారం, పాలు, మంచి నీరుతో పాటు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు బాధితులందరికి నిత్యావసర వస్తువులు, డ్రై ఫుడ్ పంపిణీ చేశారు. అయితే వరదలో చిక్కుకున్న కాలనీ వాసులు కట్టు బట్టలతో మిగిలారన్న సంగతి తెలిసిందే.. వరద బాధితులందరికీ తలా ఒక జత బట్టలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వరద పోయి మిగిలిన బురద.. పారిశుధ్యం పనులు ముమ్మరం

వరద తగ్గుముఖం పట్టడంతో బురద బాగా పేరుకుపోయింది. దీంతో అనేక రకాల వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్న నేపధ్యంలో పారిశుధ్యం పనులు వేగంగా సాగుతున్నాయి. అంతేకాదు బాధితులకు సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇంటింటికీ నష్ట గణన సర్వే తో పాటు హెల్త్ సర్వే కూడా కొనసాగుతోంది. అనేక వాహనాలు, ఫ్రిజ్, గ్యాస్ స్టవ్ సహా ఇతర నిత్యావసర వస్తువుల వంటి వరద నీటిలో మునిగిపోయాయి. వీటి మరమ్మత్తులకు మెకానిక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు పర్యటించారు. స్వయంగా క్షేత్ర స్థాయిలో వరద ప్రభావాన్ని తెలుసుకున్నారు. ఇక పదో రోజూ ఎన్టిఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చందరబాబు నాయుడు. ఈ రోజు సాయంత్రానికి చాలా ప్రాంతాలలో సహాయక చర్యలు పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఉంటూ సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో నిమగ్న,అయ్యారు అధికారులు.. ఈ సాయంత్రం పరిస్థితిని మరోసారి సమీక్షించి కలెక్టరేట్ నుంచి తన నివాసానికి వెళ్ళే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ఐదుగంటలకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆపద సమయంలో కష్టాలు సైతం లెక్కచేయకుండా నిరంతరం పని చేసిన అధికారుల సేవలను ప్రభుత్వం అభినందించనున్నది. ఇక ఈ రోజు రాత్రి ఏడుగంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.విశాఖ కు వెళ్ళే ఆలోచనలో సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్ర తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సాయంత్రం మరోసారి ఉత్తరాంధ్ర వర్షాలపై సమీక్షించి అవసరమైతే విశాఖ కు వెళ్ళే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తరాంద్రలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వర్షాలు, వరదలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తి నియంత్రణ లో ఉందని, ప్రస్తుతానికి అత్యావస్యక స్థితులు లేవని అధికారులు వివరించారు.

  • Related Posts

    SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!
    • adminadmin
    • November 23, 2024

    చైర్మన్ హోదాలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం NOC సెంటర్ ను విజిట్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఉన్న సమస్యలపై ఎలా అధికమించాలి. అలాగే కొత్త కనెక్షన్స్ పెంచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని విధి విధానాలు రూపొందిస్తున్నాం. 50 లక్షలు కనెక్టివిటీ పెంచడమే ఈ ప్రభుత్వ…

    Continue reading
    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!
    • adminadmin
    • November 18, 2024

    శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. అభయారణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంట్లు జనారణ్యం బాట పడుతున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎలుగుబంట్లు జనావాసాలలోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఉద్దాన…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!

    • By admin
    • November 23, 2024
    • 43 views
    SRIRAM TV NEWS : APSFL  చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని  ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన  APSFL చైర్మన్ గారు…!

    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    • By admin
    • November 19, 2024
    • 34 views
    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    • By admin
    • November 18, 2024
    • 31 views
    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    • By admin
    • November 18, 2024
    • 38 views
    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    SRIRAM TV NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    • By admin
    • November 2, 2024
    • 53 views
    SRIRAM TV  NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!

    • By admin
    • October 26, 2024
    • 62 views
    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!