ఏపీలో ప్రభుత్వం మారింది… పద్దతులూ మారుతున్నాయ్. బ్రిటీష్‌నాటి రూల్స్ బద్దలుకొడుతూ… తరతరాలుగా సాగుతున్న బూజుపట్టిన రాచరికానికి ఫుల్ స్టాప్ పెడుతూ సరికొత్త నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలూ.. సింపుల్‌గానే ఉండాలంటోంది.ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు కనపడవ్. పోడియంలు కానరావ్.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తరతరాలుగా సాగుతున్న రాచరికపు రూల్స్‌ను బ్రేక్ చేస్తూ… ఫ్రెండ్లీ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కోర్టుల్లో న్యాయమూర్తి తరహాలో కూర్చునే సబ్ రిజిస్ట్రార్ సీటింగ్ పద్దతిని మార్చనుంది. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోలాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కూడా సింపుల్‌గానే ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ… అన్ని ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు, పోడియంలను తొలగించాలని నిర్ణయించింది. ప్రజలకు సేవ చేయాలే తప్పా… వారి పనుల్లో నిర్లక్షంగా వ్యవహరించొద్దని అధికారులకు స్పష్టం చేసింది. అంతేకాదు పనులు ఆలస్యమైతే… ప్రజలకు మంచినీళ్లు, టీ,కాఫీ లాంటివి అందించాలంటూ ఏపీ ప్రభుత్వం కొత్త పద్దతిని తీసుకొస్తోంది.ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ గుణదలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోడియంను తొలగించారు రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. మరో రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల రూపురేఖలు మారిపోనున్నాయని తెలిపారు. పాత పద్దతులు ప్రజలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని వివరించారు.ప్రజలకు మర్యాదపూర్వకంగా పనులు చేసి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిరైనా ఉందని సిసోడియా చెప్పారు. మొత్తంగా… ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!
చైర్మన్ హోదాలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం NOC సెంటర్ ను విజిట్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఉన్న సమస్యలపై ఎలా అధికమించాలి. అలాగే కొత్త కనెక్షన్స్ పెంచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని విధి విధానాలు రూపొందిస్తున్నాం. 50 లక్షలు కనెక్టివిటీ పెంచడమే ఈ ప్రభుత్వ…