ప్రస్తుత కాలంలో మొక్కలపై చాలా మందికి ఆసక్తి పెరిగింది. మొక్కలు అంటే బయట పెంచుకునేవే కాదు.. ఇంట్లో పెంచుకునేవి కూడా చాలానే ఉన్నాయి. అందులోనూ గాలిని శుద్ధి చేసే ప్లాంట్స్ చాలానే ఉన్నాయి. ఈ ఎయిర్ ప్యూరిఫై మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచిది. ఇంటికి కూడా అందంగా ఉంటాయి. మరి ఆ మొక్కలు ఏంటో చూసేయండి.బోస్టన్ ఫెర్న్ మొక్క.. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కనిపిస్తుంది. ఈ ప్లాంట్ అమెరికాకు చెందింది. ఈ మొక్కను ఎక్కడ వేసినా.. ఎలా వేసినా ఈజీగా పెరుగుతుంది. నీళ్లు వేసినా.. వేయకపోయినా ఈ మొక్క బతికేస్తుంది. అంత సాధారణంగా చనిపోదు.
స్పైడర్ ప్లాంట్ మొక్క గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్కను కూడా ప్రస్తుతం ఇళ్లలో ఇండోర్ ప్లాంట్‌గా పెంచుతున్నారు. ఈ మొక్క ఆఫ్రికాకు చెందింది. ఈ ప్లాంట్ కూడా ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. దీన్ని పెంచడానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు.స్నేక్ ప్లాంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మొక్కను ఎంతో మంది ఇష్ట పడి మరీ ఇంట్లో పెంచుతున్నారు. ఈ ప్లాంట్ కూడా ఈజీగా పెరుగుతుంది. తక్కువ కాంతి, నీరు ఉన్నా.. పెరిగే సామర్థ్యం ఇందులో ఉంటుంది.
ఆర్చిడ్స్ మొక్కలు అందంగా ఉండటమే కాకుండా.. గాలిని కూడా శుద్ధి చేస్తాయి. ప్రస్తుత కాలంలో వీటిని కూడా ఇంట్లో పెంచుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పూలను ఎక్కువగా పర్ఫూమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.