SRIRAM TV NEWS : శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక.. ఏ ఆలయాలకి వెళ్ళకూడదు.. ఎందుకో తెలుసా..?

శ్రీకాళహస్తి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు, శ్రీకాళహస్తి వెళ్తుంటారు, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఏ ఆలయానికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు.మరి ఎందుకు ఏ ఆలయానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… తిరుమల వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉండే ఆలయాలకి కూడా వెళ్తుంటారు. పాప నాశనం, కాణిపాకం చూసి చివరగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా చూస్తారు. శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయాలకు వెళ్ళకూడదని అంటారు.

అలా వెళితే అరిష్టమని, హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పబడింది. ఎందుకు అలా వెళ్ళకూడదు..? వెళ్తే ఏమవుతుంది అనేది చూస్తే.. శ్రీకాళహస్తి కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికే వెళ్లాలి. పంచభూతాల నిలయమైన ఈ విశ్వంలో వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు తెలిసాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయు లింగం. ఇక్కడ గాలి తగిలాక ఇక ఏ దేవాలయానికి వెళ్ళకూడదు.అది ఇక్కడ ఆచారం. అలానే శ్రీకాళహస్తి వచ్చాక సర్ఫ దోషం, రాహు కేతువుల దోషం కూడా పూర్తిగా పోతుందని అంటారు. శ్రీకాళహస్తీశ్వర లోని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటారు. ఆయన దర్శనంతో కాలసర్ప దోషం పోతుంది. దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలని వదిలేసి ఇంటికి వెళ్లాలి. అందుకే నేరుగా ఇంటికి వెళ్లాలని అంటారు. ఇక ఏ ఆలయానికి వెళ్ళినా దోషం అనేది పోదు.

పైగా గ్రహణ ప్రభావం కానీ శని ప్రభావం కానీ పరమశివుడికి ఉండవని, ఇతర దేవుళ్ళకి ఉంటాయని అంటారు. ఎక్కడైనా కూడా గ్రహణ సమయంలో ఆలయాలని మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి దేవాలయంని మాత్రం మూసి వేయరు. ఎందుకంటే అక్కడ గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా ఇక్కడ జరుగుతాయి. ఇలా ఈ కారణాల వల్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ ఇతర ఆలయాలకి కూడా వెళ్లకూడదని, నేరుగా ఇంటికి వెళ్లాలని అంటారు.

  • Related Posts

    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!
    • adminadmin
    • November 19, 2024

    బంగారు రథంలపై ఊరేగుతుండగా ఆలయ అర్చకులు, వేద పండితులు రథంపై కొలువైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జరుగుతుండగా రథం ఎదుట మహిళల కోలాటాలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు…

    Continue reading
    SRIRAM TV NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    మాసాల్లోకెల్లా ఉత్తమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా దివ్యమైన కార్తీక మాసంలో చేసే స్నానానికి విశిష్టమైన స్థానం ఉంది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో శివ కేశవులను పుజిస్తారు. ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Sriram TV Updates

    SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!

    • By admin
    • November 23, 2024
    • 43 views
    SRIRAM TV NEWS : APSFL  చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని  ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన  APSFL చైర్మన్ గారు…!

    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    • By admin
    • November 19, 2024
    • 34 views
    SRIRAM TV NEWS : బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం…శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..!

    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    • By admin
    • November 18, 2024
    • 31 views
    SRIRAM TV NEWS : వారికి ఇక చుక్కలే..ఇకపై ఉమ్మడి గా పనిచేయనున్న హైడ్రా, పీసీబీ..!

    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    • By admin
    • November 18, 2024
    • 38 views
    SRIRAM TV NEWS : కార్తీక పౌర్ణమికి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎదురు వచ్చినవి చూసి పరుగో పరుగో..!

    SRIRAM TV NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    • By admin
    • November 2, 2024
    • 52 views
    SRIRAM TV  NEWS : ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే…!

    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!

    • By admin
    • October 26, 2024
    • 62 views
    SRIRAM TV NEWS: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్…31 నుంచి అందజేత…అర్హతలు..ఎలా బుక్ చేసుకోవాలి..సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు ఇవే…!