ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటీ, పర్యాటక, వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలని, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి, రాజమహేంద్రవరం, అనంతపురం, గుంటూరు లేదా విజయవాడలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణాజిల్లాలో రాయలసీమకు ఇవ్వచ్చు అని ఎన్టీఆర్ చెప్పారని, అది చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.రాయలసీమ ఫుడ్ హార్టికల్చర్ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధునిక టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేస్తామని, పరిశ్రమల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నామని, కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని, వారికి అన్ని సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.ఏపీ ఇన్నోవేషన్ హబ్ గా మారాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా మా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త పరిశ్రమలు మన రాష్ట్రంలో ఏర్పాటు అయితే యువతకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తాయని, యువతకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
SRIRAM TV NEWS : APSFL చైర్మన్ జి.వి రెడ్డి గారు APSFL లను అభివృద్ధి పథంలో నడిపించుటకు తానే స్వయంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని APSFL గాడిన పెడతామని ఆపరేటర్లకు భరోసా ఇచ్చిన APSFL చైర్మన్ గారు…!
చైర్మన్ హోదాలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం NOC సెంటర్ ను విజిట్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఉన్న సమస్యలపై ఎలా అధికమించాలి. అలాగే కొత్త కనెక్షన్స్ పెంచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని విధి విధానాలు రూపొందిస్తున్నాం. 50 లక్షలు కనెక్టివిటీ పెంచడమే ఈ ప్రభుత్వ…